సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సీరియల్ ని ప్రమోట్ చేశాడు. రెండు వారాల నుంచి టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్ దాదాపు 6 టీఆర్పీ రేటింగ్ రాబడుతున్నట్టు సమాచారం. ఈ సీరియల్‌ను మహేష్ బాబు ప్రమోట్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ సీరియల్ పేరు ప్రేమ ఎంత మధురం. ఈ సీరియల్ నటీనటుల విషయానికి వస్తే.. ఆర్య వర్థన్ పాత్రలో వెంకట్ శ్రీరామ్ నటించగా, అను కేరక్టర్‌లో వర్ష హెచ్‌కె నటించింది. హైదరాబాద్ నేపథ్యంలో జరిగే ఈ కథలో రెండు డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ కలిగిన ఆర్యవర్థన్, అను మధ్య పుట్టిన ప్రేమే అసలు కథాంశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa