కమల హాసన్ నటిస్తోన్న ‘ఇండియన్ 2’ షూటింగ్‌లో ఇటీవల భారీ ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న బృందానికి హీరో శింబు భీమా చేయించాడు.
ఆయన ప్రస్తుతం 'మానాడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా బృందం కోసం 7.8 లక్షల రూపాయలు ఖర్చు చేసి, రూ.30 కోట్ల విలువైన బీమా చేయించాడు. సినిమా కోసం పనిచేస్తోన్న కార్మికుల సంక్షేమం కోసం ఈ బీమా చేయించాడని ఈ సినిమా నిర్మాత సురేష్ కామాక్షి తెలిపారు. దీంతో ఆ సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సినిమా యూనిట్ ఇలాగే బీమా తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa