యాంకర్స్ భామలు ఈ రోజుల్లో ఎలా కనిపిస్తున్నారో అందరికి తెలిసిందే. మాటలతో ఆకట్టుకునేవారికంటే వారి అందాల గురించి మాట్లాడుకునేలా చేసేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు హాట్ యాంకర్స్ చాలా మంది పుట్టుకొస్తున్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. అమ్మడికి పెళ్లైనా ఇద్దరు పిల్లల తల్లైన ఇంకా గ్లామర్ డోస్ ని ఏ మాత్రం తగ్గించలేదు. రియాలిటీ షో ద్వారానే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది.
జబర్దస్త్ తో పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ సినిమాల్లో కూడా తనదైన శైలిలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ప్రస్తుతం టాప్ లో ఉన్న శ్రీ ముఖి - రష్మీ లాంటి సెక్సీ భామలకు గట్టి పోటీని ఇస్తోంది. ఇక మధ్య మధ్యలో ఫొటో షూట్స్ ఇస్తూ కుర్రకారును కలవరపెడుతోంది. అదే స్థాయిలో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ కూడా నెటిజన్స్ ని చాలా ఆకట్టుకుంటోంది. సింపుల్ గా ఒక చీరలో హోమ్లీగా కనిపించినట్లే కనిపించి దానికి గ్లామర్ టచ్ ని ఇచ్చేసింది.
ఎక్కువగా ఆమె ఇచ్చిన స్టీల్స్ వల్ల అందంగా కనిపిస్తోంది అనే అనుమానాన్నీ కలిగిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలను ఆమె ఫాలోవర్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే అనసూయ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న రంగస్థలం సినిమాలో ఒకే స్పెషల్ రోల్ చేసింది. అంతే కాకుండా మరొక సినిమాలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa