సుజిత్ దర్శకత్వం లో ప్రభాస్ నటించిన సినిమా ‘సాహో. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అభిమానులంతా తమ అభిమన హీరో ఏ సినిమా చేయబోతున్నారా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ "జిల్" ఫెమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజ హెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమాకు 'రాధేశ్యామ్ 'అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమా బ్యూటీఫుల్ లవ్ స్ట్రోరీగా తెరకెక్కనుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 16 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డేట్ లాక్ చేశారని సమాచారం. అంటే ఈ ఏడాది దసరా సీజన్ కు ప్రభాస్20 ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తం గా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa