‘హిట్’ సినిమాలో విష్వక్సేన్ జోడీగా నటించింది నటి రుహానీ శర్మ. ఈ సినిమా విడుదలకి ముందే ఆమె మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నటుడు నాగశౌర్య హీరోగా మహేశ్ కోనేరు ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుహానీ శర్మను ఎంపిక చేసినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa