తనపై వస్తోన్న తప్పుడు ప్రచారంపై యాంకర్ శ్రీముఖి మండిపడింది. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, లవ్‌లో ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. 'భూత, వర్తమాన కాలాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో లవ్‌లో ఉన్నాను.. ఇప్పుడు లవ్‌లో ఉన్నాను అనే వ్యాఖ్యలకు చాలా తేడా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వీడియో చేసినందుకు చాలా వార్తలు వచ్చాయి' అని తెలిపింది
'కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. కొంచం చూసుకొని రాస్తే అందరికీ బాగుంటుంది. రాసే వారికి న్యూస్ అవసరమన్న విషయం నాకు తెలుసు. కాస్త చూసుకొని రాస్తే మీకే మంచిది. ప్రస్తుతానికి లవ్ ఎఫైర్స్ లాంటివి ఏమీ లేవు' శ్రీముఖి తెలిపింది.
'నిజాలు తెలుసుకుని, ఇంగ్లిష్ నేర్చుకుని రాస్తే మీకే మంచిది. మ్యాటర్ బాగా కనుక్కుని రాస్తే బాగుంటుంది. షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించి నా కంటే మీకే బాగా తెలుసు. నిజంగానే నేను లవ్‌లో పడితే, నాకు బాయ్‌ఫ్రెండ్ ఉంటే నేనే అతడితో ఓ వీడియో తీసుకుని, ఇతడే నా బాయ్‌ఫ్రెండ్ అంటూ వీడియో తీసి నేను చెబుతాను. సరేనా?' అంటూ శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది.
Sreemukhi gives strong Counter on Fake News about her Lover | Sreemukhi ... https://t.co/T65zAcsu6h via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 29, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa