విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వంత్ దుద్దంపూడి మీడియాతో మాట్లాడారు. 'మనమంతా' సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన విశ్వంత్, ఆ తరువాత తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. తాజాగా రూపొందిన 'ఓ పిట్టకథ' సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విశ్వంత్ ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .. 'గ్రామీణ నేపథ్యంలో రూపొందిన విభిన్నమైన కథా చిత్రం ఇది. ప్రతి పాత్రకి ఒక పిట్టకథ ఉంటుంది. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. చంద్రశేఖర్ యేలేటిగారు ముందుగా ఈ కథ విన్నారట. కథ చాలా బాగుందని ఆయన చెప్పారు. ఆయనపైగల నమ్మకంతో నేను కథ వినలేదు. ఈ తరహా స్క్రీన్ ప్లే తో ఇంతవరకూ ఏ సినిమా రాలేదనే చెప్పాలి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa