దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ 11న విడుదలైంది. ‘సరిలేరు నీకెవ్వరు’ వసూళ్ల పరంపర కొనసాగించింది. మొదటిరోజే రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పండుగ సీజన్ కి వచ్చిన పర్ఫెక్ట్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఈ చిత్రం విడుదలై అప్పుడే 50 రోజులు దాటేసింది. ఈ 50 రోజుల్లో రూ. 145 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.145 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన మూడు, నాలుగు వారాల్లో ఈ సినిమా అక్కడక్కడా సత్తా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.121 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించింది చిత్రయూనిట్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. గ్రాస్ విషయానికి వస్తే మొత్తంగా రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించింది.50 రోజులు పూర్తి కావడంతో అన్నిచోట్లా కూడా ఫైనల్ రన్ పూర్తైపోయింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో మార్చి ఒకటో తేది నుంచి స్ట్రీమింగ్ చేసారు. రీసెంట్‌గా 50 రోజుల సందర్భంగా విడుదల చేసిన మైండ్ బ్లాక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ పాట 10 మిలియన్ పైగా వ్యూస్ సంపాదించింది. తాజాగా ఈ చిత్రం నుంచి సూర్యుడివో చంద్రుడివో సాంగ్‌ను రిలీజ్ చేసారు. విజయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ బాబు ఉన్న ఈ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది. ఈ పాట ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకొని ఉంది. చాలా రోజుల తర్వాత ఒక స్టార్ హీరో చిత్రంలో ఇలాంటి పాటను సందర్భాను సారంగా పెట్టడం విశేషమనే చెప్పాలి.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. ప్రరాక్ ఈ పాటను అద్భుతంగా పాడాడు. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa