ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా అంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడా ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2020, 08:01 PM

'బాహుబలి', 'సాహో' చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాకుండా అన్ని భాషల్లో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభాస్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట నిర్మాతలు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నాడు. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీసే సినిమా సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని, ఆ సినిమాకు ప్రభాస్ ఏకంగా 70 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తయినదనే న్యూస్ నడుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa