డేరింగ్ అండ్ డాషింగ్ కు మరోపేరు వరలక్ష్మి శరత్ కుమార్. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా వరలక్ష్మి శరత్ కుమార్ రాణిస్తోంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకత. గురువారం(మార్చి 5) నటి వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'క్రాక్' సినిమా నుంచి ఆమె లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర పేరు 'జయమ్మ' అని తెలుపుతూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె లుక్ చూస్తుంటే 'క్రాక్'లో పోషించే రోల్ చాలా బలమైనదని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa