ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్ స్టోరి' సినిమాలో లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాగచైతన్య...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2020, 02:53 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరి వస్తోన్న సంగతి తెలిసిందే. మంచి కాఫీ లాంటీ చిత్రాలతో తెలుగువారి హృదయాలను దోచుకున్న శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని నాగ చైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమా చాలావరకు షూటింగ్ జరపుకుంది. ఈ సినిమాలో చైతు ఒక దిగువ మధ్య తరగతికి చెందిన తెలంగాణ కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. తొలిసారిగా తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.


ఇదిలా ఉంటే తాజాగా 'లవ్ స్టోరి' సినిమా నుండి కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి.  ఇందులో ఒక పోస్టర్లో చైతు పూర్తిగా డీ-గ్లామరస్ గా కనిపిస్తూ ఉండడం విశేషం.  చైతు ఎప్పుడూ క్లాస్ గా స్టైలిష్ గా కనిపిస్తాడు.  కానీ ఈ పోస్టర్లో మాత్రం అచ్చంగా ఒక లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా కనిపిస్తున్నాడు. షార్ట్ హెయిర్ స్టైల్.. కొంచెం చిందరవందరగా ఉన్న గడ్డం.. పర్ఫెక్ట్ సైజ్ లో ఉన్న టీ షర్టు కాకుండా కొంచెం వదులుగా ఉండే టీషర్టు వేసుకుని నవ్వుతూ కనిపిస్తున్నాడు. గతంలో కంటే సన్నగా ఉండడం.. మేకప్ లేకపోవడంతో చైతు కొత్తగా కనిపిస్తున్నాడు.


శేఖర్ కమ్ముల సినిమాలలో అనవరసమైన కమర్షియల్ హంగామా ఉండదు. దాదాపుగా అన్ని సీన్లలో సహజత్వం కనిపిస్తుంది.  నాగ చైతన్య -సాయి పల్లవి జోడిని.. వారి ప్రేమకథను కమ్ముల సార్ ఈసారి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa