విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'ఫైటర్'. అనన్యా పాండే కథానాయిక. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల సెట్‌లో తీసిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. విజయ్, అనన్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా మొదట దిశా పటానీని సంప్రదించారట. కానీ నటించేందుకు ఆమె ఒప్పుకోలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె నో చెప్పడంతో చిత్రబృందం అనన్యని సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిందని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa