ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి తొలి సాంగ్ ను విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు ‘మగువ మగువ’ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మగువ మగువ’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ‘మగువ మగువ లోకానికి తెలుసు నీ విలువ.. మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా..’అంటూ కొనసాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa