ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోల పై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 04:19 PM

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు పెడుతున్నది. మొన్నటి వరకు చైనా, చైనా వెలుపల ఆసియా, ఐరోపా దేశాలను గజగజలాడించిన కరోనా ఇప్పుడు ఇండియాలో కూడా ఎంటర్ అయ్యింది.  దుబాయ్, ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తుల వలన ఈ వైరస్ ఇండియాలో ఎంటర్ అయ్యింది. దీనికి చికిత్స ఇంకా లేకపోవడంతో అన్ని దేశాల్లోనూ టెర్రర్ సృష్టిస్తోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా దీని వ్యాప్తిని అరికట్టడంలో వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇంతలా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ సెటైర్ వేశాడు. విలన్‌లా భయపెడుతున్న ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోవాల్సిన హీరోలందరూ ఎక్కడికి పోయారంటూ ట్వీట్ చేశాడు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్‌ ఇంతలా గడగడలాడిస్తుంటే.. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ మొదలైన హీరోలందరూ ఎక్కడ ఉన్నారు. వారు వేరే గ్రహానికి పారిపోయారని మాత్రం చెప్పకండి` అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa