అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ . ఈ సినిమా టైటిల్ ‘లాయర్ సాబ్’. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కంచె సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ప్రగ్యా పక్కింటి అమ్మాయిగా నటించి మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ స్టార్ హీరోయిన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం మొదలుపెట్టాయి. పక్కింటి అమ్మాయి పాత్రల నుంచి గ్లామర్ హీరోయిన్ గా అందాలు ఒలకబోస్తున్న పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
కాగా, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ కు ఓ అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేమంటే, పవన్ కళ్యాణ్ తన 27 వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, ప్రగ్యా జైస్వాల్ లు హీరోయిన్ గా చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రగ్యా తిరిగి సార్ హీరోయిన్ గా మారుతుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa