సైరా విజయం ఇచ్చిన ఊపు మీద ఉన్నచిరంజీవి, తన 152 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాను మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో మెగాస్టార్ తో పాటుగా మహేష్ బాబు కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తుంటే, మెగాస్టార్ అగ్రెసివ్ రోల్ చేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది రోజున రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఉగాది రోజున రిలీజ్ చేయబోతున్న పోస్టర్ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa