సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్, సుకుమార్ శిష్యుడు డైరెక్షన్ లో 'ఉప్పెన' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో వైష్ణవ తేజ్ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసినప్పుడు ఈ సినిమాలు అంతగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ విడుదలయిందో అప్పటి మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ దేవీశ్రీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సుకుమార్ మీద నమ్మకం, దేవిశ్రీ మీద భరోసా వేసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు దాదాపు 20కోట్ల బడ్జెట్ పెట్టిందనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే హీరో, హీరోయిన్ కన్నా ఎక్కువగా విలన్ కి రెమ్యునరేషన్ అధికంగా ఇచ్చారట. ఉప్పెన లో విలన్ గా చేస్తున్న విజయ్ సేతుపతి 7 కోట్లు ఇచ్చారట. అయితే టైటిల్ దగ్గరనుండి సినిమా మీద పోజిటివిటి కనబడడం, లుక్ లోను, మ్యూజిక్ విషయంలోనూ పోజిటివిటి ఉండడంతో.. ఈ సినిమాకి 15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ మిగతా 10 కోట్లు డిజిటల్, శాటిలైట్ హక్కులు కింద వచ్చేస్తాయనే ధీమాతో మైత్రి మూవీస్ ఉందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa