ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2020, 04:00 PM

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్యాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పాడు. దాంతో ఈ సినిమా కథా వస్తువు ఎలాంటిదై ఉంటుందనే ఆసక్తి అందరిలో తలెత్తింది.


ఈ సినిమా .. 'ఆదిత్య 369' తరహాలో సాగుతుందనేది తాజా సమాచారం. ఆ సినిమా తరహాలోనే కాలంలో వెనక్కి వెళ్లడం .. భవిష్యత్తులోకి వెళ్లడం వంటివి ఈ సినిమాలో వుంటాయని అంటున్నారు. అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి 80న శాతం షూటింగ్ గ్రీన్ మ్యాట్ లోనే నాగ్ అశ్విన్ చిత్రీకరించనున్నాడని అంటున్నారు. ప్రభాస్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa