చమేలీ, హీరోయిన్ చిత్రాలలో అత్యంత శక్తివంతమైన పాత్రలు పోషించింది బాలీవుడ్ నటి కరీనాకపూర్. ఈ రెండు పాత్రలు ఆమె కెరియర్‌లో ప్రత్యేకమైనవిగా నిలిచిపోయాయి. ఇటీవల కరీనా ఒక షోలో తన టాప్ ఫైవ్ క్యారెక్టర్స్ గురించి చెప్పింది. వాటిలో ‘హీరోయిన్’ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఒకటని చెప్పింది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కరీనా కపూర్ న్యూడ్ సీన్ చేసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఏమనుకున్నా సరే ఈ సినిమాలో నటించినందుకు ఎంతో గర్వపడుతున్నానని చెప్పింది. ఈ సినిమా కోసం తన వంతుగా వందశాతం కష్టపడ్డానని, ఈ సినిమాలో న్యూడ్ సీన్ కూడా చేశానని.. ఇంతలా ఏ సినిమా కోసం కష్టపడలేదు. అయితే ప్రేక్షకులు తనను అలా చూసేందుకు ఇష్టపడలేదని చెప్పింది. మధుర్ బండార్కర్ అద్భుతమైన డైరెక్టర్ అని, నటులలోని ప్రతిభను వెలికి తీయడంలో అతను ముందుంటారని కొనియాడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa