'అల వైకుంఠపురములో' సినిమా భారీ విజయం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ లారీ డైవర్ గా నటించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందనహీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల నేపథ్యం లో సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడట. ఇందుకోసం చిత్తూరు యాస కూడా నేర్చుకుంటున్నాడు బన్నీ . తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. ఇక విలన్ గా జగపతి బాబు నటించనున్నారని సమాచారం. బన్నీ - విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. 'రంగస్థలం' సినిమా తరువాత సుకుమార్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతుండటం తో అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు దేవీ శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa