తమిళ స్టార్ హీరోకు తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. గతకొన్నేళ్లుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ మధ్యన సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. వరుస ఫెయిల్యూర్స్తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ ఇయర్ సూర్య నటించిన ‘NGK’, ‘బందోబస్త్’ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటూ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో అతడి మార్కెట్ ప్రస్తుతం జీరోకి పడిపోవడం ఇబ్బందికరంగానే మారింది. ప్రస్తుతం `ఆకాశమే హద్దురా` అనే బయోపిక్ తో సూర్య లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఈసారి కాయా పండా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
ఇక ఈ సినిమాకు బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు సూర్య గట్టిగానే చేస్తున్నాడు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులందరికీ తెలిసేలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. ఇటీవలే ఎగిరే విమానంలో తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఆ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అందులో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సెకెండ్ లిరికల్ సాంగ్ ``సిత్రమైనా భూమి...`` అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. ఇందులో సూర్య పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.
పాటలో ఊర మాస్ పదాలు కావాల్సినవన్నీ జొప్పించారు. సూర్య మాస్ స్టెప్పులు అభిమానులకు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటను విలేజ్ నేపథ్యంలో చిత్రీకరించారు. రాకేంద్ మౌళి సాహిత్యం అందించగా జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్.. రేవంత్ ద్వయం ఆలపించారు. `గురు` ఫేం సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ డైరెక్టర్ తో పనిచేయడం సూర్యకి ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తానికి మొన్న క్లాస్ సూర్యని...నేడు మాస్ సూర్యని సాంగ్ లో ఎలివేట్ చేయడం విశేషం. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa