ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమృతపై శ్రీరెడ్డి సంచనల వ్యాఖ్యలు..

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2020, 01:51 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆదివారం ఆత్మహత్య చేసుకొన్నారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆ వెంటనే అమృత, ఆమె బాబాయ్ శ్రవణ్ ల వార్ ఏపీసోడ్ మొదలైంది. మరోవైపు అమృతపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది.'నిన్ను చూసి సిగ్గుగా ఉంది' అంటూ అమృతను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసేసింది. అమృతను క్షమించమని కోరుతూ మరో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. 'నీ పెయిన్ ఏంటో నాకు అర్థమైంది అమృత.. సారీ, నేను నీపై చేసిన కామెంట్‌పై రియలైజ్ అయ్యాను.. నువ్ చాలా పోగొట్టుకున్నావు. ఆ దేవుడు నిన్ను, నీ బిడ్డను దీవించాలని కోరుకుంటున్నా' అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa