నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వలో ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. ఈ చిత్రంపై అటు నిర్మాత ఉమేష్ గుప్తా, ఇటు హీరో కల్యాణ్‌రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే వారి అంచనాలని తల కిందులు చేస్తూ ఫ్లాప్ కావడం చిత్ర వర్గాలని షాక్‌కు గురిచేసింది. ఈ సినిమా తరువాత కల్యాణ్‌రామ్ కొత్త దర్శకుడితో భారీ సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. `ఢీ` ఫేమ్ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు మల్లిడి వేణు ఈ చిత్రం ద్వారా దర్శకుడి ఆ పరిచయం కాబోతున్నారు. 13వ శతబ్దానికి చెందిన కథ ఇదని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ సరికొత్త గెటప్‌లో గుబురు గడ్డం, మీసం, జట్టుతో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఆ లుక్‌లోకి మారిన కల్యాణ్‌రామ్ తాజాగా అపోలో లైఫ్ స్టూడియో జిమ్ నుంచి బయటికి వస్తుండగా కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నివిశేషాల్ని చిత్ర వర్గాలు త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa