మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఆచార్య’. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదీ సోషల్ మెసేజ్ సినిమానే అయినా.. చిరు నుంచి ఆయన అభిమానులు కోరుకునే అన్నీ అంశాలు ఉండేలా ప్లాన్ చేశారట.చిరంజీవికి నుంచి అభిమానులు ఆశించే మరో అంశం డాన్స్. ఈ విషయంలో అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లోను నిరాశకి లోను కాకూడదని కొరటాల .. సంగీత దర్శకుడు మణిశర్మకి చెప్పారట. చిరూ స్టైల్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన బాణీలను సమకూర్చుతున్నాడట. ఆ బాణీలకు స్టెప్స్ కూడా కొత్తగా డిజైన్ చేయించే ఆలోచనలో కొరటాల వున్నాడని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa