ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కథ బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధపడ్డ నాని

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2020, 04:40 PM

కమర్షియల్ అంశాలతోపాటు నటనకు ఆస్కారం ఉన్న కథలను ఎంచుకుంటూ చకచకా సినిమాలు చేస్తుంటాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో నాని నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇక, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `టక్ జగదీష్` సినిమాలోనూ నాని నటిస్తున్నాడు.


ఇక నాని హీరోగా నటిస్తున్న మరో సినిమా `శ్యామ్ సింగరాయ్`. `టాక్సీవాలా` చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ కోసం నాని ఏకంగా రూ.50 లక్షలు వెచ్చించాడట. హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీ మేనేజర్‌ దగ్గర నుంచి నాని ఈ కథను రూ.50 లక్షలకు కొన్నాడట. కథ బాగా నచ్చడంతో నాని భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధపడ్డాడట. `టక్ జగదీష్` తర్వాత ఈ సినిమాను నాని పట్టాలెక్కించనున్నాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa