కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్‌లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. అయితే ఇప్పటి వరకు అజిత్ కు సోషల్ మీడియాలో ఖాతా లేదు. త్వరలోనే అజిత్ సోషల్ మీడియాలో ఖాతా ఓపెన్ చేయబోతున్నట్టు నెట్టింట్లో అజిత్ సంతకం చేశసిన ఓ నోటీసు వైరల్ అయింది. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఆ నోటు ఫేక అట.అందులో ఉన్న సంతకం కూడా అజిత్ కుమార్‌ది కాదని తేలిపోయింది. 'అజిత్ కుమార్ త్వరలోనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ నోటీసు శుక్రవారం నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. లెటర్ హెడ్‌తో పాటు అజిత్ సంతకం కూడా నకిలీవే. ఈ వార్తను చూసిన తర్వాత తమతో పాటు అజిత్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని' అజిత్ లీగల్ టీమ్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa