30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రదీప్ టూ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా ఏరియాల్లోనూ విడుదలవుతున్న ఈ చిత్రం ఓవర్సీస్‌లో మాత్రం రిలీజ్ కావడం లేదు. క్రేజ్ లేదనా లేక ఓవర్సీస్‌లో రిలీజ్ చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ఆసక్తి చూపించకపోవడం వల్లనా అన్నది మాత్రం తెలియలేదు. మొత్తానికి ప్రదీప్ తొలి సినిమా ఓవర్సీస్ రిలీజ్ లేదని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa