మూడేళ్ళ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. 'అహం బ్రహ్మాస్మి' పేరుతో మనోజ్ ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ రోజు ఫిల్మ్ నగర్‌లోని దేవాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ వేడుకకి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు మనోజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా .తాజాగా వీళ్లిద్దరు ఓ సినిమాలో కలిసి నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. వీళ్లిద్దరు చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు సమాచారం. అందులో వీళ్లిద్దరు వాళ్ల తండ్రుల పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి, మోహన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. కే.యస్.ఆర్.దాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పింజల నాగేశ్వరరావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న యాక్షన్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది.ఇక ‘బిల్లా రంగా’ రీమేక్ విషయమై కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఈ రీమేక్ విషయమై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయాలని రామ్ చరణ్, మంచు మనోజ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఈ రీమేక్ పట్టాలెక్కితే.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. అంతేకాదు ఈ సినిమాను రామ్ చరణ్, మంచు మనోజ్ సంయుక్తంగా తెరకెక్కించాలనుకున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి వీళ్లిద్దరు కలిసి ‘బిల్లా రంగా’ రీమేక్‌కు ఓకే చేసి పట్టాలెక్కిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa