ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క కోసం గ్రాండ్ సెలెబ్రేషన్స్...

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2020, 06:24 PM

అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్ళయింది. ఈ పదినేళ్ళలో అమ్మడు ఎన్నో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇప్పటికే అదె స్టార్డం తో కెరీర్ ను కొనసాగిస్తున్న స్వీటీ ప్రస్తుతం 'నిశబ్ధం' సినిమా చేస్తుంది. ఈ సినిమాతో వచ్చే నెల 2న థియేటర్స్ లోకి రాబోతుంది. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంటుంది. అయితే ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఈవెంట్ కి కూడా ఎటెండ్ అవ్వని అనుష్క ఎట్టకేలకు ఈ సినిమా ఈవెంట్ లో మేరవనుంది. అవును సినిమా యూనిట్ అనుష్క పదిహేనేళ్ళ కెరీర్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలెట్టారు. రేపు సాయంత్రం ట్రైడెంట్ హోటల్ లో జరగనున్న ఈ వేడుకలో టాలీవుడ్ సెలెబ్రిటీస్ చాలా మంది విచ్చేసి అనుష్క కి కంగ్రాట్స్ చెప్పనున్నారు.
అనుష్క ను లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ నుండి ఆమె పనిచేసిన మిగతా దర్శకులు హీరోలు. నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. సో ఈ ఈవెంట్ తో సినిమాకు హైప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాగు వచ్చిన వారందరూ నిశబ్దం సినిమా గురించి కచ్చితంగా మాట్లాడతారు. మరి ఈ ఈవెంట్ లో అనుష్క గురించి ఎవరి స్పీచ్ లు హైలైట్ అవుతాయో ?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa