కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కలకలం రేగుతోంది. ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్‌పై సినీ పరిశ్రమ దృష్టి పడింది. ఈ వైరస్ ఆధారంగా ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం చక్కటి స్క్రిప్ట్ రూపొందించుకుంటున్నారు. ఈ సినిమాకు ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు.ఈ సినిమా తీస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. కరోనా వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందన్న అంశంతో పాటు అది ప్రపంచ దేశాలకు ఎలా వ్యాప్తి చెందింది? ఆ వైరస్ ప్రభావం జనాలపై ఎలా పడింది? అన్న అంశాలపై ఆయన కథ రూపొందించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa