ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయ 2 లో కలర్స్ స్వాతి...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2020, 01:58 PM

నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కార్తికేయ-2ను ఇటీవలే ప్రకటించారు. తొలి పార్టు లాగే మరో కొత్త సోషియా ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు డైరెక్టర్ చందూ మొండేటి ప్లాన్ చేస్తున్నాడు. మొదటి భాగంలో నిఖిల్ జోడీగా కలర్స్ స్వాతి కనిపించింది. ఆమె నటన ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందువలన రెండవ భాగంలో ఆమె ఉందా? .. లేదా? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.తాజాగా నిఖిల్ మాట్లాడుతూ .. కలర్స్ స్వాతి పాత్రకి కొనసాగింపు ఉందనీ, ఆ పాత్రలో ఆమే నటిస్తుందని స్పష్టం చేశాడు. అంతేకాదు .. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉంటుందనీ, ఆమెను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పాడు. ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa