ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2020, 03:22 PM

బాలకృష్ణ హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మరి బోయపాటి ఈ ఉగాదికైనా బాలయ్య బాబు ఫస్ట్ లుక్ వదులుతాడేమో చూడాలి. కాగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఫైట్స్ ను షూట్ చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి కథానాయకిగా ఫైనల్ కాగా ఇంకొక కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే శ్రియా సరన్ ను సెకెండ్ హీరోయిన్ కోసం తీసుకోవాలనుకుంటున్నారట. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa