తెలుగులో నాని హీరోగా వచ్చిన “మజ్ను” సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది అను ఇమాన్యుయేల్.ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాలన్” తెలుగులో “డిటెక్టివ్ ” గా వచ్చింది.ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది. అయితే వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. తాజాగా ఓ తెలుగు సినిమాకు అను సైన్ చేసిందట అను
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అను హీరోయిన్‌గా నటించబోతున్నారని సమాచారం .ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తాడని టాక్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa