నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘v’ సినిమాలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో విలన్ పాత్రలో మెప్పించబోతున్నారు టీజర్ రిలీజ్ అయింది. అయితే 'నిన్నుకోరి' కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని 26వ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'టక్ జగదీష్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో నానికి జంటగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సాహూ గారిపాటి, హారీష్ పెద్ది నిర్మాతలు.టక్ జగదీష్ తొలి షెడ్యూల్ పొల్లాచ్చిలో జరిగిన విషయం తెలిసిందే. తాజా చిత్రీకరణ రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఒక పాట, ఇంకా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. చిత్రంలోని తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటారు. ఇక ఈ సినిమా తర్వాత `శ్యామ్ సింగ రాయ్` సినిమాలో నాని నటించనున్నారు. ఈ చిత్రానికి `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa