ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్, కైషా రావత్ హీరో హీరోయిన్లు గా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం "విట్ఠల్ వాడి". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. రోహిత్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. కైషా రావత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమిత్ , రోల్ రిడా అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడుతూ... విట్టల్ వాడి సినిమా కొన్ని వస్తావ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించబడింది.మమ్మల్ని నమ్మి నరేష్ గారు ఈ సినిమాను నిర్మించినందుకు ధన్యవాదాలు. జయశ్రీ గారు, అప్పాజీ గారు ఇలా అందరూ ఈ సినిమాలో బాగా నటించారు. డైరెక్టర్ నాగేంద్ర సినిమాను బాగా తీశారు. అందరికి నచ్చే సినిమా అవుతుందనని భావిస్తున్నాను. మార్చి 20న విడుదలవుతున్న మా సినిమాను అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.
హీరోయిన్ కైషా రావత్ మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. హీరో రోహిత్ తో వర్క్ చెయ్యడం మర్చిపోలేను అనుభూతి. విఠల్ వాడి ఒక మంచి లవ్ స్టొరీ, సరదాగా సాగే కథ ఇది, యూత్ ఫుల్ ఎంటర్త్సైన్మెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ విజయం సాధిస్తుందని భావిస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ... నిర్మాత నరేష్ గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయన చెప్పిన ఒక పాయింట్ ను తీసుకొని విఠల్ వాడి సినిమా తీయడం జరిగింది. హీరో రోహిత్ ఈ కథకు కరెక్ట్ గా సెట్ అయ్యాడు, కొత్త హీరో అయినా అనుభవం కలిగిన నటుడిలా నటించాడు, అబ్బాజీ గారు ఈ కథ విని సినిమా ఒప్పుకున్నారు. సినిమా అంతా బాగా వచ్చింది, మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాలు అన్ని అంశాలు ఉన్నాయి. కొత్త సినిమాలను సపోర్ట్ చేస్తే మా లాంటి కొత్తవారు ఇండస్ట్రీకి వస్తారు. మమ్మల్ని మొదటినుండి ప్రోత్సహిస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత నరేష్ మాట్లాడుతూ... సహజమైన కథ కథనాలతో సాగే సినిమా ఇది. హ్యాపీగా నవ్వుతూ చూడొచ్చు, డైరెక్టర్ నాగేంద్ర బాగా తీసాడు, హీరో రోహిత్ నటన ప్రధాన బలం. సంగీతం, కెమెరా వర్క్ అన్ని ఈ సినిమాకు బాగా కుదిరాయి. కొన్ని రియల్ ఇన్సెడెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిపారు.
నటీనటులు: రోహిత్ రెడ్డి ,కైషా రావత్ ,అమిత్,రోల్ రిడా, అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర
సాంకేతిక నిపుణులు: కెమెరా మెన్ - సతీష్ అడపా, మ్యూజిక్ - రోషన్ కోటి ,ఎడిటింగ్ - శ్రీనివాస్ మోపర్తి ,పి ఆర్ ఓ - మధు వి ఆర్ ,ఫైట్స్ - శంకర్, ప్రొడ్యూసర్ - జి నరేష్ రెడ్డి ,డైరెక్టర్ - నాగేందర్ టి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa