దిల్ రాజు బ్యానర్లో సినిమాలు చెయ్యడానికి యంగ్ హీరోలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ అంటే హిట్ పక్క అంటూ సంబరపడేవారు. కానీ గత కొన్నాళ్లుగా ఏ యంగ్ హీరో దిల్ రాజు బ్యానేర్ లో నటించినా వారికి డిజాస్టర్స్ చుట్టుకుంటున్నాయి. కానీ విశ్వక్ సేన్ తన మూడో సినిమాని దిల్ రాజు బ్యానర్ లో ఓ కొత్త దర్శకుడితో మొదలెట్టబోతున్నాడట.
నరేశ్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో దిల్ రాజు ఆ కథకి విశ్వక్ హీరో అయితే బావుంటుంది అని అనుకోవడమే తడవుగా విశ్వక్ ని పిలిచి ఒప్పించారనే టాక్ వినబడుతుంది. అయితే దిల్ రాజు - విశ్వక్ సినిమాకి 'పాగల్' అనే టైటిల్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa