ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాడు సినిమా.. నేడు ట్రేండింగ్ కారణం కరోనా

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2020, 12:18 PM

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్‌ కలకలం రేపుతోన్న నేపథ్యంలో గతంలో వైరస్‌పై వచ్చిన ఓ సినిమాపై ప్రేక్షకులు ఇప్పుడు అమితాసక్తి కనబర్చుతున్నారు. అమెరికన్ మెడికల్‌ థ్రిల్లర్‌ సినిమా కంటెజియన్ (ఇంగ్లిష్‌ మూవీ) కథ కరోనా వైరస్‌కి సంబంధించిన కథలాగే ఉంది. దీంతో ఆ సినిమాను ప్రేక్షకులు  డౌన్‌లోడ్‌ చేసుకుని మరీ చూస్తున్నారు.కరోనా విజృంభన నేపథ్యంలో ఆ సినిమా డౌన్‌ లోడ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మాట్‌ డామన్‌, లారెన్స్ ఫిష్‌ బర్న్‌, జూడ్‌ లా, గ్వినేత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టీవెన్ సోడర్‌ బర్గ్‌ తెరకెక్కించిన ఈ సినిమాను 2011, సెప్టెంబర్‌లో విడుదల చేశారు. ఈ సినిమాకు అప్పట్లో మంచి స్పందన వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa