శ్రీవిద్య దర్శకత్వంలో రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం మధ. ఏకంగా 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.
కథ: నిషా (త్రిష్నా ముఖర్జీ)కి హ్యూమిడిటి ఎక్కువ.. డ్రగ్ గాని, వైన్ గాని ఆమె పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. ఇక నిషా ఒక అనాధ.. ఆమె జాబ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె లైఫ్ లోకి అర్జున్ (రాహుల్) చీట్ చెయ్యడానికి కావాలని ఎంటర్ అవుతాడు. ఆమెను ప్రేమలో దించి మానసికంగా ఆమెను వీక్ చేసి అందరూ ముందు ఆమెను పిచ్చిదానిగా క్రియేట్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం నిషా ఒక మెడికిల్ మాఫీయా చేతుల్లో చిక్కుకుంటుంది. ఆమె పై డ్రగ్స్ ప్రయోగం చేస్తుంటారు. రవి వర్మ అనే వ్యక్తి ఇదంతా చేస్తుంటాడు. అతనికి నిషాకి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు అర్జున్ ఎవరు ? అతను నిషానే ఎందుకు టార్గెట్ చేశాడు ? ఇంతకీ అతను మంచివాడా ? చెడ్డవాడా ? చివరికి నిషా ఆ మెడికిల్ మాఫీయా నుండి బయట పడిందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్రధాన పాత్ర నిషా పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి ‘మధ’ వైవిధ్యంగానే సాగింది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిష్నా ముఖర్జీ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మెయిన్ గా హీరోయిన్ కి మానసిక సమస్యలు ఉన్నాయని హీరో నమ్మించే సన్నివేశాల్లో ఆమె నటన.. అలాగే ఆమె పై డ్రగ్స్ ప్రయోగం చేసినప్పుడు ఆమె పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. న్యూ యాంగిల్ లో హీరోయిన్ పాయింట్ అఫ్ వ్యూలో శ్రీవిధ్య ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేసింది. కొత్త నటీనటులతో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తియ్యడం మాటలు కాదు. కానీ శ్రీవిధ్య మంచి దర్శకత్వ పనితనం కనబరిచింది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రంగా వచ్చిన ఈ సినిమా లోన్లీగా ఫీల్ అయ్యే ప్రతి అమ్మాయికి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుంది. ఇక హీరోగా నటించిన రాహుల్ కూడా బాగానే నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో ప్లేని సాగతీయడంతో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ బిల్డప్.. దానికి తగ్గట్లుగానే హీరో ఇచ్చిన సీరియస్ లుక్స్.. చివరికి హీరో క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు అతని క్యారెక్టరైజేషన్ కి పై వాటికి ఎక్కడా పొంతన లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా కలిగిస్తాయి. అయితే శ్రీవిద్య బసవ దరకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటీ… అదే విధంగా ఆమె రాసుకున్న కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరియ క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ విభిన్నంగా ఉండటంతో కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. దానికి తోడూ మొదటి భాగం కథనంలో ప్లో అర్ధం కాకుండా ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతోంది.
సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకురాలు శ్రీవిద్య బసవ షాట్ మేకింగ్ అండ్ ఆమె విజన్ చాలా బాగుంది. ఇక సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే కచ్చితంగా ఆమె టాలెంట్ ను మెచ్చుకోవాలి. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా ఆమె సినిమాని తెరక్కించారు. కెమెరామెన్ అభిరాజ్ నాయర్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సినిమాకు అతని కెమెరా కన్ను పెద్ద ప్లస్ అయింది. సంగీత దర్శకుడు నరేశ్ కుమరన్ అందించిన సంగీతం పరవాలేదు. అయితే సీన్ మూడ్ తో ఓవరాల్ సినిమాని దృష్టిలో పెట్టుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి బాగుండేది. ఎడిటర్ రంజిత్ టచ్‌రివర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్లాష్ బ్యాక్ కి లైవ్ కి మధ్య స్మూత్ కట్టింగ్ తో ఆయన ఎడిట్ చేశారు. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని తగ్గించినా.. ఎక్కడా ఆ ఫీల్ కలగదు. శ్రీవిద్య అంత చక్కగా సినిమాని మలిచింది.
తీర్పు : వైవిధ్యమైన కంటెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమాకి డ్రా బ్యాగ్స్ గా అనిపిస్తాయి. అయితే శ్రీవిధ్య డైరెక్షన్ అండ్ ఆమె చేసిన సిన్సియర్ అటెంప్ట్ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అయితే ముందు చెప్పుకున్నట్లు.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఆడియన్స్ ను ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు.
నటీనటులు : త్రిష్నా ముఖర్జీ, రాహుల్ ,దర్శకత్వం : శ్రీవిద్య బసవ ,నిర్మాతలు : ఇందిరా బసవ ,సంగీతం : నరేశ్ కుమరన్ ,సినిమాటోగ్రఫర్ : అభిరాజ్ నాయర్ ,ఎడిటర్ : రంజిత్ టచ్‌రివర్ ,రేటింగ్ : 3/5.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa