ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్సాఫిస్ వద్ద మళ్ళీ పోటీ పడుతున్న బాలయ్య , మెగాస్టార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2020, 04:11 PM

బాక్సాఫిస్ దగ్గర హీరోలకు మంచి పోటీ ఉంటుంది. ఒకరి పై ఒకరు సై అంటే సై అని బరిలోకి దిగుతారు. ఈ సారికూడా . ఇద్దరు దిగ్గజాలు పోటీకి సిద్ధమౌతున్నారు .చిరంజీవి, బాలక్రిష్ణ ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లు పోటీ పడుతున్నారు. పందెంలో పైచేయి సాధించేది నువ్వా నేనా అన్న రేంజ్‌లో పరుగులు తీస్తున్నారు. ఇక ఈ మెగానందమూరి రన్నింగ్ రేసుతో కొరటాల శివ, బోయపాటి శ్రీనుకి కొత్త టెన్షన్స్‌ మొదలవుతున్నాయట. గతం లోను చిరంజీవి, బాలకృష్ణ చాలా సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఓ వైపు బాలయ్య బోయపాటి తో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. గతంలోబాలకృష్ణకు  'సింహా' 'లెజండ్' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి.  ఈ సారికూడా సాలిడ్ హిట్ ఇవ్వడానికి ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసాడట.ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అటు కొరటాల శివ చిరంజీవి సినిమా కూడా శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది.  ఈ సినిమాలో చిరు ఫారెస్ట్ ఆఫీసర్ కనిపించనున్నారని తెలుస్తుంది. అదే విధంగా నక్సలైట్ గా కూడా చిరు కనిపించనున్నారని సమాచారం. మంచి సోషల్ మెసేజ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. పైగా కొరటాల సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది . కాబట్టి చిరు సినిమా పై అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు.  ఈ ఇద్దరుహీరోల  సినిమాలు ఒకేసారి  విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరి సినిమాల్లో ఈసినిమా విజయం సాధిస్తుందో చూడాలి 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa