ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2020, 09:51 AM

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కావడం..ఇద్దరు క్రేజీ హీరోలు నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఎన్టీఆర్ తాలూకా ఓ వార్త అభిమానుల్లో రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. అలాగే ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వస్తున్నాయట. మొత్తానికి ఎన్టీఆర్ ను హైలైట్ చెయ్యటానికి రాజమౌళి క్రేజీగానే ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. ఇక ఈ సినిమాలో డైలాగ్ లు అద్భుతంగా ఉంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa