మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో సాలిడ్ హిట్ అందుకొని ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఈ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో వంశీపైడి పల్లి ప్లేస్ లోకి పరశురామ్ ఎంటర్ అయ్యారు. మహేష్‌తో ఆయన సినిమా చేయాలనేది గతంలోనే ఒప్పందం ఉండగా.తాజాగా సన్నాహాలు ముగింపు దశకొచ్చాయని తెలుస్తుంది.మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సంస్థ తొలి చిత్రం 'శ్రీమంతుడు' మహేష్‌తోనే నిర్మించింది. ఇక పరశురామ్, మహేష్ బాబు కొత్త సినిమా ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్ర ఇతర నటీనటులు, సాంకేతిక వివరాలు తెలియాల్సిఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa