దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమవుతోంది బాలీవుడ్ నటి అలియా భట్. ఈ చిత్రంలో సీత పాత్రలో కనిపించనుంది. అలియా భట్ పుట్టినరోజు సందర్బంగా ఆర్ఆర్ఆర్ టీం ఆమెకి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మీతో కలిసి పనిచేయడానికి వేచి చూస్తున్నాం అని తెలిపింది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న అలియా భట్ మరి కొద్ది రోజులలో మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్‌కి రానుందట. ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 8,2021న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa