దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కరోనా కారణంగా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ షెడ్యూల్స్ కి సైతం బ్రేక్ పడే అవకాశం కలదు. ఇప్పటికే మార్చి 31వరకు ఎటువంటి షూటింగ్స్ నిర్వహించరాదని టాలీవుడ్ ప్రముఖులు నిర్ణయించారు. రాజమౌళి ఆందోళన వెనుక అసలు కారణంగా కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణే అని తెలుస్తుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో అనుకున్న విడుదల తేదీకి ఆరు నెలలు వాయిదా పడింది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 8న 2021లో విడుదల కానుంది. అయితే రాజమౌళి కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర నూతన వైరస్ కారణంగా ప్రపంచం స్థంభించిపోయిందన్న ఆయన, ఇలాంటి పరిస్థితులలో ప్రజలు భయాందోళను దూరం చేయడం ఆవశ్యకం అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, సలహాలు పంచుకున్నారు.
It's shocking to see the world come to a standstill. However, in a scenario like this it's imperative to avoid spreading panic. Follow the standard recommendations to prevent the spread of the #COVID19 infection and stay alert. https://t.co/dzzDfuDP9k
— rajamouli ss (@ssrajamouli) March 16, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa