మహేష్ బాబు నటించిన "భరత్ అనే నేను" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ కియారా అద్వానీ. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో బిజీ హెరాయిన్ అవుతుందని అంత అనుకున్నారు. మహేష్ సినిమా తర్వాత రాంచరణ్ తో వినయ విధేయ రామ సినిమా లో నటించింది కియారా ఈ సినిమా తర్వాత తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం తో అమ్మడికి అక్కడ వరుస ఆఫర్లు పలకరిస్తున్నాయి. కియార్ ఆమధ్య ఆకును అడ్డుపెట్టుకొని ఓ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.. టాప్ లెస్ లో కేవలం ఆకు మత్రమే అడ్డుగా పెట్టుకొని ఫోటీషూట్ చేసింది. ఈ ఫోటో తెగ వైరల్ అయ్యింది. తాజా ఏ ఫోటో పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కొత్తగా ఉంటుందని ట్రై చేశా.. మీకూ నచ్చిందా.. అయితే నాకూ నచ్చింది" అంటూ చిరునవ్వులు చిందించింది.ఇక ఈ ఫోటోకి కామెంట్లకు అయితే కొదవలేదు. కొందరు మాత్రం..'కియారాను తాకిన ఆ ఆకును నేనైతే చాలా బాగుండేది - నా జన్మ ధన్యమయ్యేది' అంటూ చిలిపిగా కామెంట్లు చేస్తున్నారు. వాటి గురించి కియారా స్పందిస్తూ.. అలాంటి కామెంట్లు నాకు కూడా నచ్చాయి. కొన్నింటికి లైక్ కూడా కొట్టాను.. అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa