ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన నెక్స్ట్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్న సూర్య..

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 18, 2020, 01:40 PM

సూర్య తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఆకాశమే నీ హద్దురా' ముస్తాబవుతోంది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది. తదుపరి ప్రాజెక్టును ఆయన హరి దర్శకత్వంలో చేస్తున్నాడు.  'అరువా' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.


గతంలో సూర్య 'బ్రదర్స్' సినిమాలో కవల సోదరులుగా కనిపించాడు. ఆయన కెరియర్లోనే ఆ సినిమా వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోయింది. అలాగే 'అరువా' సినిమాలోను సూర్య కవల సోదరులుగా కనిపించనున్నాడు. ఒక పాత్రలో మంచివాడిగా .. మరో పాత్రలో దుర్మార్గుడిగా ఆయన కనిపించనున్నట్టు చెబుతున్నారు. అంటే ఈ సినిమాలో హీరో ఆయనే .. విలన్ ఆయనేనన్న మాట. వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్లో ఈ ప్రయోగాత్మక చిత్రం రూపొందుతుండటం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa