టాలీవుడ్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని పాజిటివ్ బజ్‌తో మాసివ్ మల్టీస్టారర్‌గా దర్శకధీరుడు జక్కన్న రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి బ్రేక్ పడింది.ఇద్దరు స్టార్ హీరోలు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అగ్ర దర్శకుడు ,రాజమౌళి సినిమాల్లో హీరోలను ఎంత బాగా చూపిస్తారో.. విలన్లకు అదే రేంజ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. బాహుబలి, ఈగ, ఛత్రపతి, మగధీర ఇలా ఏ సినిమా చూసుకున్నా.. ప్రతి నాయకుడ్ని హీరో మాదిరి చూపిస్తారు. అలా.. బాహుబలి చిత్రంలో రానాను భల్లాలదేవుడిగా చూపించి జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కేలా చేశారు. ఇక జక్కన్న అప్ కమింగ్ సినిమాలో సైతం ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు హీరోలతో ఢీ కొట్టడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్‌ను విలన్‌గా రంగంలోకి దింపారు. ఈ కథలో బలమైన పాత్రలో కనిపించబోతున్న అజయ్ దేవగన్‌కు జోడీగా టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియను ఎంపిక చేశారట జక్కన్న. గ్లామర్ డాల్‌గా స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన ఈ బ్యూటీ అయితే అజయ్ దేవగన్‌కి పర్ఫెక్ట్ జోడీ అని పైగా.. శ్రియ అందచందాలు అదనపు ఆకర్షణ కానుండటంతో ఆమెను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి బాలీవుడ్ దృశ్యం మూవీలో నటించి ఉండటంతో ఈ కాంబోకి మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పటికే వికారాబాద్ అడవుల్లో జరుగుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌కి శ్రియ వెళ్లిందని అజయ్, శ్రియలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తన చిత్రం క్యాస్ట్ అండ్ క్రూ విషయాలను అఫీషియల్‌గా ప్రకటిస్తుంటారు రాజమౌళి.అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో శ్రియ జాయిన్ అయ్యిందనే విషయాన్ని ప్రకటించాల్సిఉంది. ఈ సినిమాలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తుండగా ఆయనకు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆలియా భట్ జోడీ కడుతోంది. అజయ్ దేవగణ్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి 'రఘుపతి రాఘవ రాజారాం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa