రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. క్రైస్తవ మత గురువు కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ పై ఇప్పటికే పలు రకాలుగా ట్వీట్లు చేసిన వర్మ.. తాజాగా కేఏ పాల్‌ను ఉద్దేశిస్తూ.., అరే కేఏ పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావు.. నీకు దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్టు చేయి అంటూ కేఏ పాల్ పై కాస్తంత వ్యంగ్యంగానే ట్వీట్ చేసాడు. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కేఏ పాల్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దీని పైనే వర్మ తనదైన శైలిలో ట్విట్టర్‌లో విరుచుకపడ్డాడు.
Aey K A Paulu ee sutthi salahaalu ichche badulu nee devuni tho cheppi coranani theeseyyamani cheppacchu kadhara Subba Rao ...neeku nijamgaa devudi daggara antha scene vunte nenu tittina thitlaki naaku corona vachchetattu cheyyi yenkamma !https://t.co/lbffjjNp7h
— Ram Gopal Varma (@RGVzoomin) March 18, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa