'అల వైకుంఠపురములో' సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతంతో సినిమా అనుకున్న దానికంటే భారీ విజయాన్ని సాధించింది. ఆల్బమ్ మొత్తం అదిరిపోవడంతో తమన్ డేట్స్ కోసం బడా దర్శకులు కూడా క్యూ కట్టారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరెకెక్కే సినిమాకు కూడా తమన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తో ఇంతకుముందే తమన్ బృందావనం, అరవింద సమెత సినిమాలు చేసాడు. ఈ సినిమాల్లోని సాంగ్స్ కూడా ఇప్పటికీ అందరికి గుర్తుండిపోయాయి. మళ్ళీ ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa