'సరిలేరు నీకెవ్వరు'.. 'భీష్మ' సినిమాల హిట్స్ తో దూసుకుపోతుంది రష్మిక. అంతేకాకుండా ప్రస్తుతం సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్స్ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సుకుమార్ కథ అందిస్తున్న '18 పేజెస్' సినిమాలో మొదట రష్మికను హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారట. దీనికోసం రష్మికను సంప్రదించగా ఆమె నో చెప్పినట్లు సమాచారం. ఆమె మరో రెండు సినిమాలకు డేట్స్ ఇవ్వడం వలన ఈ సినిమాకు నో చెప్పిందట. కాగా 18 పేజెస్ సినిమాలో హీరోగా నిఖిల్ సిద్దార్ధ నటిస్తుండగా.. హీరోయిన్ గా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa