ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ప్లేస్ లో మెగా హీరో

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2020, 05:21 PM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత వరుస హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం సుబ్బు అనే కొత్త దర్శకుడితో 'సోలో బ్రతుకే సోబెటర్' అనే సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో దేవకట్ట దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో తేజ్ కనపడనున్నాడట.అయితే ఈ కథను మొదట దేవాకట్టా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట. పవన్ కి కథను వినిపిద్దాం అనుకునేలోపే పవన్ రాజకీయాలలో బిజీ అయిపోయారు. దీంతో ఈ కథను సాయిధరమ్ తేజ్ కు వినిపించాడట దర్శకుడు. మరి పవన్ ని ఊహించుకు రాసుకున్న ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa